సికింద్రాబాద్ వెళ్తున్న కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ సుమారు 3 గంటలపాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం- ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య విద్యుత్ తీగ తెగి పోవటం వల్ల రైలు ఆగిపోయింది. చీకటిలో మార్గమధ్యలో రైల్ నిలిచిపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్నకల్, నెక్కొండ నుంచి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. అధికారులు డీజిల్ ఇంజిన్ తెప్పించి నిలిచిపోయిన రైలును మరోలైన్లో కాజీపేట వరకు తీసుకొనిపోయారు. ఈ ఘటనతో ఇరువైపులా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
విద్యుత్తీగ తెగింది... రైలు 3 గంటలు ఆగింది... - విద్యుత్తీగ తెగింది... రైలు 3 గంటలు ఆగింది...
విద్యుత్ తీగ తెగిపోయి సికింద్రాబాద్ వెళ్లాల్సిన కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ మార్గమధ్యలో ఆగిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు సుమారు 3 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో వెళ్లాల్సిన పలు రైల్లు కూడా ఆలస్యంగా నడిచాయి.
KOLLAPUR EXPRESS TRAIN STOPPED 3 HOURS DUE TO TECHNICAL PROBLEM
TAGGED:
TRAIN TROUBLES IN TELANGANA