తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంగారూ రైతులందరి సమస్యలు పరిష్కరించండి - తెజస అధ్యక్షుడు

రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది రైతులు భూ వివాదాలతో రైతుబంధు చెక్కులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి వారందరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ జన సమితి

By

Published : Mar 29, 2019, 9:20 AM IST

రైతులందరికీ సాయం చేయాలంటున్న కోదండరాం
ఫేస్​బుక్​లో వచ్చిన ఓ రైతు సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పరిష్కరించడం అభినందనీయమని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తాము చేసిన సర్వేలో చాలా మంది రైతులు ఇదే సమస్యతో బాధపడుతున్నారని సీఎం వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. తెజస అభ్యర్థులు పోటీ చేయని చోట కాంగ్రెస్​కు మద్దతిస్తామని ప్రకటించారు. ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details