తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలులో ప్రయాణిస్తుండగా.. గుండెపోటుతో మృతి - One person died of a heart attack while going on a train

కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్​లోని ఆసుపత్రికి రైలులో వెళ్తుండగా గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన డోర్నకల్ రైల్వేస్టేషన్​లో చోటుచేసుకుంది.

రైలులో ప్రయాణిస్తుండగా.. గుండెపోటుతో మృతి

By

Published : Nov 8, 2019, 10:22 AM IST

హైదరాబాద్​లోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా లిప్లీ ఆనంద్ సేనాపతి (45)గుండెపోటుతో మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి ముంబయికి వెళ్తున్న ఎల్​టీటీ(లోకమాన్య తిలక్ టెర్మినల్)రైలులో ప్రయాణం చేస్తున్న లిప్లీ రైలు డోర్నకల్ రైల్వేస్టేషన్​కు చేరుకోగానే గుండెపోటు సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో వెంటనే రైలును ఆపి మృతదేహాన్ని దించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఒడిశా రాష్ట్రం భరంపురం నివాసి.

రైలులో ప్రయాణిస్తుండగా.. గుండెపోటుతో మృతి

ఇదీ చూడండి : ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details