తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగాల భర్తీ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

తెలంగాణలో మాఫియా, కుటుంబ పాలన నడుస్తోందని ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. చెరుకు సుధాకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని.. ఏపూరి సోమన్న కళాబృందంతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

By

Published : Feb 4, 2021, 1:20 PM IST

mahabubabad, mlc elections, inti party
మహబూబాబాద్‌, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇంటి పార్టీ

టీఎస్‌పీఎస్‌సీ ద్వారా లక్షా 31వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ సవాల్‌ విసిరారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం.. ఏపూరి సోమన్న కళాబృందంతో కలిసి ఆయన నిర్వహించారు.

ఉమ్మడి పాలనలోనే ఇలా లేదు

రాష్ట్రంలో మాఫియా, కుటుంబ పాలన నడుస్తోందని సుధాకర్ ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో కూడా ఉద్యోగులకు ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించలేదని.. స్వరాష్ట్రంలో ఇలాంటి ప్రకటనలను ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. కొట్లాడేవారు, ప్రశ్నించే వారు లేకపోతే రాజుల అధికారం తప్ప తెలంగాణలో ఏమి మిగలదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు బడుగు, బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే ఆ రోజు దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఈటెల రాజేందర్‌కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పట్టభద్రులు అంతా మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో ఇంటి పార్టీని గెలిపించాలని ఓటర్లను సుధాకర్‌ కోరారు.

'ఉద్యోగాల భర్తీ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

ఇదీ చదవండి:నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం: రాంచందర్​రావు

ABOUT THE AUTHOR

...view details