జూనియర్ పంచాయతీ సెక్రెటరీ బ్యాక్‌లాక్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ.. అభ్యర్థులు మహబూబాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెరిట్ ఆధారంగా ఖాళీలు భర్తీ చేయకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆ పోస్టుల్లో అక్రమాలు జరిగాయని ఆందోళన - పంచాయతీ సెక్రెటరీ బ్యాక్‌లాక్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు
మహబూబాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట జూనియర్ పంచాయతీ సెక్రెటరీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఆ పోస్టుల నియామకాల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆ పోస్టుల్లో అక్రమాలు జరిగాయని ఆందోళన
ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను కాకుండా.. తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నియమాకల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా పంచాయతీ అధికారిణి వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు రోస్టర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియామక ప్రక్రియకు సంబంధించిన విషయాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి :కాజిపేటలో దారికోసం ఆందోళన