31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను మహబూబాబాద్‌లో కలెక్టర్ శివలింగయ్య జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించాలని నినాదాలు చేశారు.
వినూత్న రీతిలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు - మహబూబాబాద్ జిల్లా వార్తలు
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను కలెక్టర్ శివలింగయ్య ప్రారంభించారు. వినూత్న రీతిలో కళాకారులు పాటలు పాడుతూ రవాణా శాఖ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు.
వినూత్న రీతిలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు
కళాకారులు కళాజాత ప్రదర్శిస్తూ రవాణా శాఖ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద కేంద్రంలో మానవహారం చేశారు. జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను అందరూ పాటిస్తూ ప్రమాద రహితంగా మార్చాలని రవాణా శాఖ అధికారి భద్ర నాయక్ కోరారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు