మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా తొలిరోజు ఎంగిలి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా జరుపుకోనున్నారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు వేసిన కోలాటాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ వేడుకలను తిలకించడానికి ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
'ఆకట్టుకున్న ఎంగిలి బతుకమ్మ వేడుకలు' - మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

'ఆకట్టుకున్న ఎంగిలి బతుకమ్మ వేడుకలు'