మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రి(Mahabubabad Government Hospital) ఐసీయూలో సీలింగ్ కూలి ఇద్దరు రోగులపై పడింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్ నిలిపేశారు. అందులో ఉన్న 10మందిని మరో వార్డులోకి తరలించారు.
ప్రభుత్వాస్పత్రి ఐసీయూలోకి వరదనీరు... కూలిన సీలింగ్.. - heavy rains in mahabubabad district
మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి(Cyclone Gulab) ప్రభుత్వాస్పత్రిలోని ఐసీయూ సీలింగ్ కూలింది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో కూలిన సీలింగ్
మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిని(Mahabubabad Government Hospital) 300 పడకలుగా ఇటీవలే అప్‌గ్రేడ్ చేశారు. మొదటి అంతస్తులో ఐసీయూ ఉండగా... రెండో అంతస్తులో నిర్మాణం చేసేందుకు స్లాబ్‌కు రంధ్రాలు చేశారు. నిన్న భారీగా కురిసిన వర్షానికి రంధ్రాల నుంచి నీరు చేరుకుని సీలింగ్ కూలింది. మరోవైపు రాత్రి కురిసిన వర్షానికి ఐసీయూలోకి వరదనీరు చేరింది.
ఇదీ చదవండి:Cyclone Gulab Effect on Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. స్పెషల్ కంట్రోల్ రూమ్
Last Updated : Sep 27, 2021, 2:24 PM IST