తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల్య విహహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్​ అధికారులు - child marriages latest news in telangana

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు, బంధువులకు పెళ్లి వయస్సుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం జరిపించాలని వారికి తెలియచేశారు.

ICDS officers blocking child marriage in Mahabubabad district
బాల్య విహహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్​ అధికారులు

By

Published : Jun 21, 2020, 4:01 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో 14 సంవత్సరాల బాలికకు 20 సంవత్సరాల అబ్బాయితో విహహం చేసేందుకు నిశ్చయించారు. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్​ అధికారులు పోలీసు సిబ్బందితో వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడి పెళ్లి నిలిపివేశారు. అనంతరం వారికి కౌన్సిలింగ్​ నిర్వహించారు.

ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని వరంగల్​లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. బాల్య దశలో వివాహాలు చేస్తే శారీరకంగా ఇబ్బందులు తలెత్తుతాయని సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. రక్త హీనత వ్యాధి వస్తుందని, తద్వారా వారికి పుట్టే పిల్లలకు మానసికమైన రుగ్మతలు వస్తాయని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details