తెలంగాణ

telangana

ETV Bharat / state

చలికాలంలోను చెమట పట్టించిన విద్యుత్​ బిల్లు.. మూడుకోట్ల పైనే కట్టాలట - కోట్లు దాటిన కరెంటు బిల్లు

Huge Current Bill : విద్యుత్‌ బిల్లుల పంపిణీ ప్రక్రియలో తప్పులు దొర్లడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. సగటున నెలకు రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో బిల్లు రావడం వల్ల వినియోగదారులు ఖంగుతింటున్నారు. నెలకు ఎప్పుడూ రూ. 100 నుంచి వచ్చే బిల్లు కోట్ల రూపాయల్లో రావడంతో అవాక్కవడం ఆ ఇంటి యజమానివంతైంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Electricity Bill
Electricity Bill

By

Published : Feb 15, 2022, 7:26 PM IST

Huge Current Bill : వారిది అపార్ట్​మెంట్​లోని ఓ ప్లాట్​.. విద్యుత్​ బిల్లు ప్రతి నెలా రూ. 200లోపే వస్తుంటుంది. కానీ ఈ నెలలో మాత్రం వచ్చిన బిల్లు చూస్తే వారికి నిజంగానే కరెంట్​ షాక్ తగిలింది. ఈ నెలలో కరెంటు బిల్లు అక్షరాలా రూ.3కోట్ల 20 లక్షల 5వేల,218 వచ్చింది. సర్వీసు నెంబర్​కు ఉన్నన్ని సంఖ్యల్లా ఉన్న బిల్లు మొత్తాన్ని చూసి ఇంటి యజమాని షాకయ్యాడు.

మహబూబాబాద్ పట్టణంలో కృష్ణవేణి స్కూల్ సమీపంలోని బొల్లం నాగేశ్వరరావు అపార్ట్​మెంట్​లో ప్లాట్​ నెంబర్​ 302కు భారీ మొత్తంలో విద్యుత్​ బిల్లు వచ్చింది. ప్రతి నెల రూ.200లోపు వచ్చే బిల్లు.. ఈసారి రూ.3కోట్లకు పైగా రావడంతో ఇంటి యజమానితో పాటు అపార్ట్​మెంట్​ వాసులు అవాక్కయ్యారు.

అధికారులు ఏమంటున్నారు...

విద్యుత్​ బిల్లు విషయంలో ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని... సరి చేసి ఇవ్వాలని అపార్ట్​మెంట్​ వాసులు కోరగా.. బిల్లుపై ప్రింట్​ తప్పుగా పడిందని.. సరిచేసి ఇస్తామంటున్నారు విద్యుత్​ శాఖ అధికారులు. ఏది ఏమైనా సర్వీసు నెంబర్​ అంత ఉన్న బిల్లు మొత్తాన్ని చూసి.. ఇంటి యజమానికి చలికాలంలో కూడా చెమటలు పట్టాయి.

ఇదీ చూడండి :Polytechnic Exam Paper Leak: పాలిటెక్నిక్ పేపర్​ లీక్ ఘటనలో నలుగురికి రిమాండ్​

ABOUT THE AUTHOR

...view details