ఎలాంటి అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించారంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులోని బొడ్లడ స్టేజీ వద్ద తెల్లవారుజామున దాదాపు 40 ఇళ్లను తొలగించారు. తమ నివాస గృహాలను అకారణంగా తొలగించాలంటూ పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
దంతాలపల్లిలో ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు - మహబూబాబాద్ జిల్లా తాజా సమాచారం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులోని అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను నిర్మించారని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జేసీబీలతో సుమారు నలభై ఇళ్లను నేలమట్టం చేశారు.
దంతాలపల్లిలో ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
గతంలో ఆ భూమిని దళితులకు కేటాయించగా వారు ఇతరులకు విక్రయించారు. ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంగా మారడంతో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో 8 మండలాల పోలీసు సిబ్బంది సహకారంతో జేసీబీలు తెచ్చి పని పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో కొమురయ్య, డీఎస్పీ సురేశ్, తహసీల్దార్ కోమల దగ్గరుండి పర్యవేక్షించారు.