మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎస్సారెస్పీ స్టేజ్2 కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు (owner locked office). కార్యాలయానికి చెల్లించాల్సిన అద్దె ఏళ్లు తరబడి చెల్లించకపోవడం వల్ల లాక్ వేశాడు. కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఆఫీసుకు తాళం చూసి అవాక్కయ్యారు.
కార్యాలయానికి రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని... కిరాయి కోసం చాలాసార్లు అడిగినా ఇవ్వలేదని ఇంటి యజమాని సక్రునాయక్ అంటున్నాడు. అద్దె వసూలు కోసమే కార్యాలయానికి తాళం వేశానని వివరించాడు.
కార్యాలయానికి తాళం వేసి ఉండడం వల్ల ఉద్యోగులు సుమారు మూడు గంటల పాటు బయటే ఉన్నారు. ఇంటి యజమానికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని... ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని కార్యాలయ అధికారులు తెలిపారు.
కార్యాలయానికి చెల్లించాల్సిన అద్దె ఆలస్యమైందని ఇంటి ఓనరు తాళం వేశారు (owner locked office). ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెండింగ్ అద్దెను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇంటి ఓనర్ను పిలిపించి పరిస్థితిని వివరిస్తాం.-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.
ఇదీ చూడండి:cotton industry: కాటన్ పరిశ్రమ వెలవెల.. ఉపాధి కోల్పోయిన కార్మికులు.