మహబూబాబాద్ జిల్లాలో హిజ్రాలు బోనాల పండుగను బుధవారం ఆనందంతో నిర్వహించుకున్నారు. కొత్త కుండలను పసుపు, కుంకుమలతో అలంకరించి వేప రెమ్మలు కట్టి మేళతాళాలతో ముత్యాలమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. తలపై బోనంతో నృత్యాలు చేసుకుంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి చీర, సారె సమర్పించుకున్నారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నామని హిజ్రాలు తెలిపారు.
మహబూబాబాద్‌లో ఘనంగా హిజ్రాల బోనాల పండుగ - హిజ్రాల
హిజ్రాలు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. తలపై బోనం పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మహబూబాబాద్‌లో ఘనంగా హిజ్రాల బోనాల పండుగ