మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దంతాలపల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజ స్తంభం ఒరిగిపోయింది.
ఈదురు గాలులు: నేలకొరిగిన ధ్వజ స్తంభం - ఈదురు గాలుల తాజావార్తలు
మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సుమారు రెండు గంటల పాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దంతాలపల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గాలుల ధాటికి ధ్వజస్తంభం ఒరిగిపోయింది.
![ఈదురు గాలులు: నేలకొరిగిన ధ్వజ స్తంభం High wind rain Mahabubabad District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7546647-5-7546647-1591710490521.jpg)
ఈదురు గాలులు: నేలకొరిగిన ధ్వజ స్తంభం
దశాబ్దాల క్రితం ప్రతిష్ఠించిన ధ్వజ స్తంభం విరిగిపోవటం వల్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. ఇసుక వాగు కాలనీలో భారీ చెట్టు విద్యుత్ తీగలపై కూలిపోయింది. రామానుజాపురంలో గాలుల ధాటికి రెండు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో చెట్లు నేలమట్టమయ్యాయి.