పేదలకు అన్నదానం చేయడం సంతోషకర విషయమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన నాగేశ్వర్‌రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎస్పీ పరిశీలించారు. సొంత ఖర్చులతో రోజూ 100 మందికి రెండు పూటలా అన్నదానం చేయడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేస్తూ నాగేశ్వర్రావును అభినందించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.
పేదలకు చేయూతనివ్వడం అభినందనీయం : ఎస్పీ కోటిరెడ్డి - Mahabubabad SP Kotireddy Latest News
లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు చేయూతనివ్వడం అభినందనీయమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. జిల్లాలోని కురవికి చెందిన నాగేశ్వర్‌రావు అనే వ్యక్తి చేస్తున్న నిత్యాన్నదానాన్ని ఎస్పీ పరిశీలించారు.

ఎస్పీ కోటిరెడ్డి