తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

మహబూబాబాద్ జిల్లా​లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్గానికి వాగులు... వంకలు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి.

heavy rains in Mahabubabad
మహబూబాబాద్​లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

By

Published : Aug 15, 2020, 10:20 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో గత నాలుగు రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్గానికి వాగులు... వంకలు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి.

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, గూడూరు, మండలాలలో కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షానికి జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. వట్టివాగు పొంగి ప్రవహిస్తుండటం వల్ల గుడూరు... నుంచి కేసముద్రం, నర్సంపేట, మహబూబాబాద్, నెక్కొండ, మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గార్ల నుంచి ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్​లకు, నెల్లికుదురు మండలంలో రావిరాల చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నండటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఈ ప్రవాహాన్ని దాటకుండా పోలీసులు బారీకేడ్​లు పెట్టి పహరా కాస్తున్నారు.

ఇదీ చూడండి:గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

ABOUT THE AUTHOR

...view details