నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గార్ల, బయ్యారం, గూడూరు, కేససముద్రం, నెల్లకుదురు, తొర్రురు, పెద్దవంగర, డోర్నకల్, కురవి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - mahabubabad district news
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు
మహబూబాబాద్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షానికి జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం, గార్ల, చిన్నముప్పారం తదితర చెరువు అలుగులు పోస్తున్నాయి.