మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జిల్లాలోని కేసముధ్రం, నెల్లికుదురు, గూడూరు, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షం కురవగా, మహబూబాబాద్ పట్టణంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే జిల్లాలోని చెరువులు ఎస్.ఆర్.ఎస్.పి. జలాలతో 50 శాతం పైగా నిండాయి. ఈ వర్షానికి చెరువులలోకి నీరు చేరి బయ్యారం పెద్ద చెరువు, గార్ల పెద్ద చెరువులు ఉద్ధృతంగా అలుగులు పోస్తుండగా చాలా చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి.
భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు - మహాబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని 16 మండలాలలో చెరువులు నిండిపోగా, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

మహాబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
మహబూబాబాద్ జిల్లాలో ఉన్న చెరువులు నేటి రాత్రి వరకు పూర్తి స్థాయిలో నిండి అలుగులు పోసే అవకాశం ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గూడూరు మండలంలోని భీముని పాదం జలపాతం నుండి జాలువారుతున్న నీటిని చూస్తూ పర్యటకులు సంతోషంలో మునిగిపోతున్నారు. రైతులు వరినాట్ల కోసం భూములను చదును చేస్తున్నారు.
మహాబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం: పోంగి పొర్లుతున్న వాగులు