ఓ వైపు రుతుపవనాలు.. మరోవైపు అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేసముద్రం, గుడూరు, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో ఓ మోస్తరు జల్లులు కురుస్తున్నాయి.
భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు - మహబూబాబాద్ జిల్లాలో వానలు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టివాగులు పొంగి పొర్లుతున్నాయి.
వర్షాల ప్రభావం.. పొంగి పొర్లుతున్న వాగులు
వానల ఫలితంగా జిల్లాలో ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టివాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుతున్నాయి. బయ్యారం చెరువు ఉద్ధృతంగా అలుగు పోస్తోంది.
ఇవీచూడండి:ఎగువన కురుస్తున్న వర్షాలు.. నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు
Last Updated : Aug 10, 2020, 9:48 PM IST