తెలంగాణ

telangana

ETV Bharat / state

HEAVY RAINS : ఎడతెరిపి లేని వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు

మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి జోరువానలు కురిశాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమునిపాదం, చింతనిగుంపు వద్దనున్న అటవీ ప్రాంతంలోని జలపాతాలు.. ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి.

HEAVY RAINS AT MAHABUBABAD
HEAVY RAINS AT MAHABUBABAD

By

Published : Jul 12, 2021, 6:53 AM IST

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం వల్ల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. రహదారులపైన వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులు జలసిరిని సంతరించుకొంటున్నాయి. శివారు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాకల వాగు పొంగిపొర్లుతోంది. ఫలితంగా గూడూరు- నెక్కొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

చుట్టూ చెట్లు, గుట్టల నడుమ ఉన్న గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం.. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. చుట్టుపక్కల వారు జలపాతం వద్దకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జలపాతం అందాలను తమ ఫోన్లతో రికార్డు చేసుకొంటూ ఆనందపడుతున్నారు. బయ్యారం మండలం చింతోనిగుంపు వద్ద అడవిలో ఉన్న జలపాతం వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఎడతెరిపి లేని వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు

ఇదీచూడండి:పిడుగుల బీభత్సం-28 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details