మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు వద్ద రామసముద్రం చెరువు అలుగు పోస్తుంది. ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆకేరు వాగుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వాగు ప్రవాహానికి పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
తొర్రూరు- నర్సంపేట మధ్య నిలిచిపోయిన వాహనాలు.. - మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ వాగులు అలుగుపోస్తున్నాయి. వరద నీటి ఉద్ధృతికి పలు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తొర్రూరు- నర్సంపేట మధ్య నిలిచిపోయిన వాహనాలు..
తొర్రూరు-నర్సంపేట వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయి.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంటయపాలెం చెరువు అలుగు పోతుండటం వల్ల గుర్తురు - కంటయపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి:వాగులో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు సురక్షితం