రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం పడింది. మహబూబాబాద్ పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులు కనిపించేందుకు వాహనదారులు హెడ్లైట్స్ వేసుకొని వాహనాలు నడిపారు.
మానుకోటలో భారీ వర్షం... అన్నదాతల హర్షం - ఉపరితల ఆవర్తనం
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ పట్టణంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల రహదారులపై నీరు నిలిచిపోయిoది. ఈ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. రైతులు వ్యవసాయ పనులను ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఇవీ చూడండి: ఆ నీటిని మేమే వాడుకుంటాం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం