మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి మున్నేరు, పాకాల వాగులు అలుగు పారుతున్నాయి, చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించడం వల్ల నెల్లికుదురు మండలం చిన్న నాగారం, ఇనుగుర్తి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద ప్రవాహంలో రెండు పశువులు కొట్టుకుపోయాయి.
ఎడతెరిపి లేని వర్షాలు.. నీటిమునిగిన పంటపొలాలు... - rain updates in mahabubabad district
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి మున్నేరు, పాకాల వాగులు పొంగి అలుగు పారుతుండటం వల్ల పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎడతెరిపి లేని వర్షాలు.. నీటిమునిగిన పంటపొలాలు...
గూడూరు మండల కేంద్రం నుంచి కమల్తండాకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ప్రవాహ ధాటికి నీటిలో పడిపోయాడు. కేసముద్రం మండలం పెసరబండ పాఠశాల ఆవరణ మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ వర్షాలకు పత్తి, వరి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Aug 27, 2020, 8:05 PM IST