తెలంగాణ

telangana

ETV Bharat / state

దంచి కొట్టిన జోరువాన... తడిసి ముద్దైన ధాన్యం - తెలంగాణ తాజా వార్తలు

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. బస్తాలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana news
మహబూబాబాద్​ జిల్లా వార్తలు

By

Published : Jun 3, 2021, 2:14 PM IST

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గం వర్షానికి తడిసి ముద్దయింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఉదయం నుంచి ఏకధాటితో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. కురవి మండలంలోని నేరడ, మొదుగులగూడెం, రాజోలు, కాంపెల్లి, తాళ్లసంకీస, కొత్తూరు సీ, మొగిలిచర్ల, చింతపల్లి, అయ్యగారిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు వర్షపునీటితో నిండాయి.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. వర్షానికి పంట తడవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:Paddy In Water:ఎడతెరిపి లేని వర్షం... తడిసి ముద్దవుతున్న ధాన్యం

ABOUT THE AUTHOR

...view details