మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కోనాపురం గ్రామంలో ఒక్కసారిగా గాలులు వీస్తూ పెద్ద శబ్దంతో వర్షం కురవడం వల్ల స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిన వడగండ్ల వాన - Hail rain
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో వడగండ్ల వాన రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిన వడగండ్ల వాన
కోత దశకు చేరుకున్న వరిపంట వడగండ్ల వాన కారణంగా నేలకొరిగింది. పంటకు పరిహారం చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం