తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్‌ - విద్యార్థులకు కరోనా పాజిటివ్

Corona Cases in gurukul school: మహబూబాబాద్ పట్టణంలోని ట్రైబల్​ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది. వైరస్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్​లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Gurukula School 15 Students Corona Positive
Gurukula School 15 Students Corona Positive

By

Published : Apr 6, 2023, 7:48 PM IST

Corona Cases in gurukul school: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​ వచ్చినట్లుగా నిర్ధారణైంది. వైరస్‌ సోకిన వారందరినీ ఐసోలేషన్​లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు.

Minister Satyavathi Responded to Hostel Student Corona: ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, ఆర్​సీఓ సంబంధిత అధికారులతో మంత్రి స్వయంగా ఫోన్ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐసోలేషన్​లో ఉన్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వారికి సమయానికి ఆహారం, వైద్యం అందేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెంద వద్దన్న మంత్రి.. కరోనా సోకిన వారని ఐసోలేట్ చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఉదయం 8 నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5,335 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి వలన 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ కొత్త వేరియంట్​ను 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' గా తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొవిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. బూస్టర్ డోసులను అందించటంతో పాటు.. కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కాంటాక్టులను గుర్తించి టెస్టులు చేయాలని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ ఒక్కటే సుమారు 600 సబ్ వేరియంట్స్​గా రూపాంతరం చెదిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ అన్ని రకాల వైరస్​లకు వ్యాధి లక్షణాలు ఒకటే ఉంటాయని, దీనిని సంబంధించి ట్రీట్​మెంట్ కూడా ఒకలాగే ఉంటుందన్నారు. మూడు లేదా నాలుగు రోజులు వైద్యం తీసుకున్నాకా కూడా అది తగ్గకపోతే అప్పుడు మాత్రం దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి దానికి తగ్గట్టుగా ట్రీట్​మెంట్ తీలుకోవాలని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details