గ్రామ పంచాయతీ అభివృద్ధికై కేటాయించిన నిధులను దుర్వినియోగం పరచడం నేరమని, గ్రామాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి అది ఆటంకమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. జిల్లా పరిధిలోని గూడూరు మండలం గుండెంగ గ్రామ సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో విధుల నుంచి సస్పెండ్ చేశారు.
పంచాయతీ నిధుల దుర్వినియోగం.. సర్పంచ్ సస్పెన్షన్! - Mahabubabad district news
గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన కారణంగా జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. సర్పంచ్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేయడం జిల్లాలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(11) క్రింద సర్పంచ్‌పై వచ్చిన ఆరోపణల మేరకు కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించారు. విచారణ అనంతరం తేలిన వాస్తవాల ఆధారంగా గుండెంగ గ్రామ సర్పంచ్ భూక్యా రవిసింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పై పంచాయతీ సర్పంచ్‌గా పూర్తి బాధ్యతలను ఉప సర్పంచ్ కందిక స్వామికి ఇస్తూ సర్పంచ్ విధులను సక్రమంగా కొనసాగించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అక్రమాలు, అవినీతికి పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. మహబూబాబాద్ జిల్లాలో ఇదే తొలి సస్పెన్షన్ కావడం గమనార్హం.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'