కరోనా బాధితుల పట్ల సేవా దృక్పథంతో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కరోనా బాధిత కుటుంబాలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. తొర్రూరు ప్రాథమిక ఆస్పత్రికి శ్రీ నిధి సంస్థ ద్వారా 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.
'ప్రజాప్రతినిధులందరూ కరోనా బాధితులకు ధైర్యం చెప్పాలి' - groceries distribution by errabelli charitable trust
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కరోనా బాధిత కుటుంబాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ప్రాథమిక ఆస్పత్రికి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
ప్రజాప్రతినిధులందరూ కరోనా బాధితులకు ధైర్యం చెప్పాలని, ఫోన్లు చేసి వారిని పలకరించాలని ఎర్రబెల్లి చెప్పారు. రూ. 8 లక్షల 50 వేలతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బహుమతిగా అందిస్తామని తెలిపిన ఎన్నారై డాక్టర్ ఝాన్సీ, రాజేందర్ రెడ్డిలను మంత్రి అభినందించారు.
ఇదీ చదవండి:సనత్‌నగర్ చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్