తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే రెడ్యానాయక్ - మహబూబాబాద్ జిల్లా వార్తలు

రైతు సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మొగిలిచర్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

grain purchase centre inaugurated by mla redya naik in mahabubabad district
రైతు అభ్యున్నతికి కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే రెడ్యానాయక్

By

Published : Dec 7, 2020, 7:55 AM IST

రైతు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడుతోందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతులు నష్టపోకుండా మద్దతు ధరతో ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న చలి

ABOUT THE AUTHOR

...view details