మహబూబాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వీపీ గౌతమ్... పరిపాలనలో దూకుడు పెంచారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏ చిన్న తప్పు కనిపించినా చర్యలు తీసుకోవడానికి వెనకాడటం లేదు.
ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు - హడలిస్తున్న కలెక్టర్ గౌతమ్
చేసే ప్రతి పనిలో ఆయన మార్క్ కనబడుతోంది. ఆయన పేరు చెబితే.. అవినీతి అధికారుల వెన్నులో వణుకుపుడుతోంది. తన రూటే సపరేటు అంటూ విధులు చేపట్టిన తొలిరోజు నుంచే దూసుకెళ్తున్నారు మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్.
ఏజెన్సీ ఏరియా కావడం వల్ల ఇంతకాలం ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది! కానీ కలెక్టర్గా గౌతమ్ బాధ్యతలు చేపట్టాక ఆకస్మిక పర్యటనలు చేయడం మొదలు పెట్టారు. ఎస్సీ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో భోజనం చేస్తూ నాణ్యత పరిశీలించారు.
ఎప్పుడు ఏ విభాగంలో తనిఖీ చేస్తారో తెలియక వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు గాబరా పడుతున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ... ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెట్లను తీయకపోతే భారీ జరిమానా విధించమని అధికారులను ఆదేశిస్తున్నారు. జిల్లాలో సమస్యలను పరిష్కరిస్తూనే, పాలనను గాడిలో పెడుతున్నారు.
- ఇదీ చూడండి :బంపర్ ఆఫర్... రూ. వందకే నాలుగు కిలోల చికెన్!