తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది' - మరిపెడలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

మహబూబాబాబాద్‌ జిల్లా మరిపెడ, కురవిలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు.

'Government is working towards farmers' welfare'
'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

By

Published : Feb 27, 2020, 11:31 PM IST

'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మహబూబాబాద్‌ ఎంపీ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మహబూబాబాబాద్‌ జిల్లా మరిపెడ, కురవిలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయా మండలాల్లోని 1,120 మంది రైతులకు పంపిణీ చేశారు.

అనంతరం ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమన్నారు. ఎలాంటి ఖర్చులు, ఇబ్బందులు లేకుండా అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తుందన్నారు.

ఇదీ చూడండి:మానవ హక్కుల కమిషన్​లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details