రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో ఆయన పర్యటించారు. ఎస్సారెస్పీ జలాలతో నిండిన చెరువులను పరిశీలించారు. అనంతరం మత్తడి పోస్తున్న ముత్యాలమ్మ చెరువులో పూజలు నిర్వహించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: రెడ్యానాయక్ - latest news on mla redya nayak
మహబూబాబాద్ జిల్లాలోని పెద్దనాగారంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించారు. గ్రామంలో ఎస్పారెస్పీ జలాలతో నిండిన చెరువులను పరిశీలించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: రెడ్యానాయక్
రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను నింపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన కొనియాడారు.
ఇదీ చూడండి: 'మా' లో మళ్లీ విభేదాలు.. రాజశేఖర్ 'చిరు' గొడవ!