మహబూబాబాద్ జిల్లా కురవి మండల శివారులోని అడవిలోకి మేకలను మేత కోసం తీసుకొని వెళ్ళాడు. అవి మేత మేస్తుండగా ఓ కొండచిలువ మేకను మొత్తంగా చుట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. మేక గట్టిగా అరవటం వల్ల అరుపులను విన్న మేకలకాపరి అటుగా వెళ్లాడు. కొండచిలువ మేకను మింగేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసి కాపాడేందుకు ప్రయత్నించాడు. అది విడిచిపెట్టక పోవటం వల్ల ఇక చేసెదేంలేక అతని వద్దనున్న గొడ్డలిలో కొండచిలువను చంపి మేకను కాపాడాడు.
ఈ మేకకు నూకలు మిగిలే ఉన్నాయి
మహబూబాబాద్ జిల్లా కురవి మండల శివారులో మేకను మింగేందుకు ప్రయత్నించిన కొండచిలువను మేకల కాపరులు చంపేశారు. కొండచిలువ సుమారు 7మీటర్ల పొడవుందని వారు చెపుతున్నారు.
ఈ మేకకు నూకలు మిగిలే ఉన్నాయి
TAGGED:
ఈ మేకకు నూకలు మిగిలే ఉన్నాయి