త్వరలో ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తొర్రూరు సీఐ చేరాలు సూచించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఉత్సవ కమిటీలు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. మండపాల వద్ద ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నియమనిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణేష్ ఉత్సవాల్లో డీజేల అనుమతి లేదు - డీజేల
వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని తొర్రూరు సీఐ చేరాలు చెప్పారు.
గణేష్ ఉత్సవాల్లో డీజేల అనుమతి లేదు