మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కొత్త పోచారంలో నూతన రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రారంభించారు. లూప్ లైన్ల నిర్మాణాలు, వంతెన, స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం డోర్నకల్ నుంచి గార్లకు వచ్చే రహదారిలో ఉన్న రైల్వే గేటు, ఆర్.యు.బి.ని పరిశీలించారు. ఎగువ రైల్వే బ్రిడ్జి పై నుంచి నడుస్తూ రైలు పట్టాల భద్రతను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న మూడో లైనుకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణ పనులు, నిర్వహణ తీరుతెన్నులను తనిఖీ చేశారు.
నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం, తనిఖీ - South Central Railway General Manager
మహబూబాబాద్ జిల్లాలోని.. కొత్త పోచారంలో నూతన రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మూడో లైనుకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణ పనులు, నిర్వహణ తీరుతెన్నులను తనిఖీ చేశారు.
![నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం, తనిఖీ Gajanan Mallya, General Manager, South Central Railway, inaugurated a new railway station at Pocharam in Mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10591015-637-10591015-1613074787923.jpg)
నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం, తనిఖీ
రాంపురం గ్రామానికి అండర్ బ్రిడ్జి, రైల్వే గేట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ.. సీపీఐ జిల్లా నాయకుడు శ్రీనివాస్, గార్లలో పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలును నిలుపుదల చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ జి.ఎం.కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి:ఫ్యామిలీతో గవర్నర్‌ను కలిసిన ఏపీ గవర్నర్