మహబూబాబాద్ మున్సిపాలిటీలో 19వ వార్డు తెరాస అభ్యర్థి డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఈరోజు తన భార్యతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. పలువురిని కలుస్తూ తనకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అభివృద్ధే ఎజెండా.. అందుకే రాజకీయాల్లోకి: డా.రామ్మోహన్ రెడ్డి - మహబూబాబాద్ నేటి జిల్లా వార్తలు
మహబూబాబాద్ మున్సిపాలిటీలో తెరాస జెండాను ఎగురవేసేందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అన్నారు. 19వ వార్డు నుంచి తెరాస అభ్యర్థిగా నామ పత్రాలను దాఖలు చేసిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి చేయాలనే.. డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి
మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డులలో తెరాసనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆ వ్యూహరచన చేశారని అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అంతా ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్