మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్రైడే.. డ్రైడే సందర్భంగా శంకర్ నాయక్ పలువార్డుల్లో పర్యటించారు. పట్టణంలోని 24 , 17, 7 వార్డుల్లో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తని తొలగించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: శంకర్ నాయక్ - ఫ్రైడే.. డ్రైడే నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
ఫ్రైడే.. డ్రైడే సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలువార్డుల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తని తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి:ఎమ్మెల్యే శంకర్ నాయక్
కరోన విజృంభిస్తోన్న సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. శానిటైజర్లను వాడుతూ పరిశుభ్రంగా ఉండాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్లు, నోడల్ ఆఫీసర్ డాక్టర్.రాజేష్, తెరాస నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.