మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లైన్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 107/బి లో వేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. తండాకు చెందిన భూక్య లచ్చు తన రెండెకరాలలో పత్తి పంట వేయగా... చిన్న నాగారం బీట్ ఆఫీసర్ సంకీర్తన ధ్వంసం చేసింది. పత్తి మొక్కలు పీకేస్తుండగా... లచ్చు కుటుంబ సభ్యులంతా కాళ్ళావేళ్ళా పడిన వినిపించుకోలేదు. 30 ఏళ్లుగా రెండెకరాలలో వ్యవసాయం చేసుకుంటూ... పట్టా పాస్‌బుక్ సైతం పొందామని భూక్య లచ్చు తెలిపాడు. తన భూమిలో పెట్టిన పత్తి పంటను.. తమకు పాస్‌బుక్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా పంటనంతా నాశనం చేశారు.
అటవీ అధికారిణి హల్చల్.. పత్తి పంట మొత్తం ధ్వంసం
సాగు చేస్తున్న పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లైన్ తండాలో చోటుచేసుకుంది. తమది పట్టా భూమి అని కాళ్లావేళ్లా పడిన వినిపించుకోకుండా.. మహిళా అధికారిణి పత్తి మొక్కలు అన్ని పీకేసిందని బాధితులు వాపోయారు.
forest officer hulchal in mahaboobabad
ప్రభుత్వం ఇచ్చిన పాస్‌బుక్‌తో తాము బ్యాంకులో లోను సైతం తీసుకున్నామని, ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు డబ్బులు సైతం తమకు వస్తున్నాయని బాధితులు వివరించారు. తమ దగ్గర ఉంది నకిలీ పాస్‌బుక్ అయితే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు తమ గోడు మన్నించి భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు అనుమతించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Last Updated : Jul 18, 2020, 8:35 PM IST