మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లిలో చేపల లూటీ జరిగింది. గ్రామంలోని పెద్ద చెరువులో మత్య్సకారులు చేప పిల్లలు పెంచుతున్నారు. కొందరు గ్రామస్థులు, పక్క ఊళ్లకు చెందిన వాళ్లు చేపలు పట్టుకెళ్లారు. కాపాలదారుడు నాగేందర్, ఆయన భార్య రాములమ్మ ఎంత బతిమాలినా పట్టించుకోకుండా చెరువులోకి దిగారు. దొరికిన కాడికి చేపలు పట్టుకున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.
చెరువులో చేపల లూటీ... కేసు నమోదు - చెరువులో చేపల లూటీ... కేసు నమోదు
చెరువులో చేపలను దొంగతనం చేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఒక్కసారిగా చెరువులోకి దిగి పట్టుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.
చెరువులో చేపల లూటీ... కేసు నమోదు