మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో విద్యుదాఘాతం సంభవించింది. బ్యాంకుకు విద్యుత్తు సరఫరా చేసే స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్విచ్ బోర్డు దగ్ధమై.. కార్యాలయం మొత్తం నల్లటి పొగతో నిండిపోయి సైరన్ మోగింది. భయాందోళనకు గురైన ఖాతాదారులంతా బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగనందుకు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
దంతాలపల్లిలోని బ్యాంకులో విద్యుదాఘాతం - దంతాలపల్లిలోని బ్యాంకులో విద్యుదాఘాతం
బ్యాంకులో విద్యుదాఘాతం సంభవించడంతో ఖాతాదారులు బయటకు పరుగులు తీసిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జరిగింది.
దంతాలపల్లిలోని బ్యాంకులో విద్యుదాఘాతం
TAGGED:
fire accident in bank