తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాటుకు తండ్రీకొడుకు మృతి.. విషాదంలో కుటుంబం - father and son died of corona in nellikuduru

కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి మృతి చెందిన రెండో రోజే కొడుకు మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంటి పెద్ద దిక్కులు ఇద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు భరోసాను కోల్పోయారు.

father and son died of corona
కరోనాతో తండ్రీకొడుకు మృతి

By

Published : May 5, 2021, 9:11 AM IST

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు వ్యవధిలో కరోనా కాటుకు తండ్రీకొడుకు ఇద్దరూ చనిపోయారు. స్థానికంగా నివసించే వృద్ధుడు( 70) కొవిడ్​తో హైదరాబాద్​లో చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందారు. ఆయన మరణించిన రెండో రోజే కుమారుడు(50).. మహమ్మారికి గురై నగరం​లోనే చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీఐ బ్రాంచ్ మేనేజర్ కరోనాతో చనిపోయారు. జిల్లాలో ప్రతినిత్యం వందల మంది కరోనా బారిన పడుతూ రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వరుస ఘటనలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:ఏ చట్టం కింద సర్వేకు వెళ్లి బోర్డు పెట్టారు?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details