మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి మిడతల దండు వచ్చిందనే వార్త కలకలం సృష్టించింది. స్థానిక రైతు మురళీధర్ రావు ఒక ఎకరం పొలంలో పచ్చి రొట్టను వేశాడు. దీనిలో మిడతలు బాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మహబూబాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ గూడూరు వెళ్లి పచ్చిరొట్ట క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ మిడతలు బయటి దేశాల నుంచి వచ్చినవి కావని, స్థానికంగా ఉండేవేనని వ్యవసాయ శాఖాధికారి తెలిపారు.
గూడూరు మండలంలో మిడతల దండు కలకలం
ఒకవైపు రాష్ట్రాల సరిహద్దుల్లో ముందస్తుగా మిడతల నివారణ చర్యలు కొనసాగుతుంటే మరోవైపు ఇప్పటికే ఒక్కటొక్కటిగా చేరుకుంటున్న మిడతలు రైతులకు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మిడతల దండు వచ్చిందనే వార్త కలకలం రేపింది. రైతు ఇచ్చిన సమాచారం మేరకు వ్వవసాయాధికారులు తక్షణమే స్పందించారు. ఇవి స్థానికంగా ఉండే మిడతలని తేల్చి చెప్పడం వల్ల రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
గూడూరు మండలంలో మిడతల దండు కలకలం
వరి పొలాలు అన్నీ కోయడం వల్ల ఆ ప్రాంతంలో ఈ ఒక్క క్షేత్రమే పచ్చగా ఉండటంతో మిడతలు అన్ని దీనిలోకి చేరాయని అన్నారు. వీటి వల్ల నష్టం ఉండదని, నష్టం కనపడితే పశువులు తినే మేత కావడంవల్ల పురుగుల మందులు కొట్టవద్దని, వేప నూనె లేదా వేప కషాయాన్ని పిచికారీ చేస్తే మిడతలు పోతాయని తెలిపారు. ఇక్కడి పరిస్థితిని శాస్త్రవేత్తలకు వివరించి స్థానిక మిడతలేనని నిర్ధారణ చేశామన్నారు
ఇవీ చూడండి: మిడతలతో విమానాలకూ ముప్పు: డీజీసీఏ