నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గపుర్‌లో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శివారులోని ఓ చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోయిన రైతులు
రాష్ట్రంలో వివిధ చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గపుర్‌లో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షంతో వరి, మిరప పైరు నెలకొరిగింది. తమను ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోయిన రైతులు, మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షాలు
మహబూబాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. గూడూరు, సీతానాగారం, మాట్టేవాడ, బయ్యారం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీని కారణంగా ఎండ బోసిన మొక్కజొన్న, మిరప పంటలు తడిసిముద్దవ్వడంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. ఈ సమయంలో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేశారు.
Last Updated : Apr 14, 2021, 4:28 AM IST