నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు, అఖిల పక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టాయి. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ, సీపీఎం,న్యూడెమోక్రసీ, తెదేపా కార్యకర్తలు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
మహబూబాబాద్‌లో ద్విచక్ర వాహనాల ర్యాలీ - bike rally at mahabubabad
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ.. అఖిల పక్ష పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల కార్యకర్తలు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని మోదీ, నూతన చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బస్టాండ్ , ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్‌లు యథావిధిగా నడుస్తున్నాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను రోజులానే కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమమలో కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'