తెలంగాణ

telangana

ETV Bharat / state

సన్నవరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన - mahaboobabad dist updates

సీఎం ఆదేశాలతో కష్టపడి పండించిన సన్నవరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతన్నలు రోడ్డెక్కారు. మహబూబాబాద్​ జిల్లా ఆమనగల్లులో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.2500 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

farmers strike in roda mahaboobabad dist in amangaal
సన్నవరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన

By

Published : Nov 24, 2020, 5:52 PM IST

అకాల వర్షాల కారణంగా దిగుబడి రాక నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లులో రహదారిపై బైఠాయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పండించిన సన్నవరి ధాన్యాన్ని క్వింటాలు రూ.2500 లతో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఏడాది తెగుళ్ల వల్ల కాటుక సోకిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతన్నల నుంచి అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతన్నలకు నచ్చజెప్పారు. ప్రభుత్వ నిబంధనలతో ధాన్యాన్ని కొంటామని వ్యవసాయ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ పోరు కోసం 21 వేల మంది సిబ్బందికి శిక్షణ

ABOUT THE AUTHOR

...view details