తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించాలి' - latest news on collector shivalingaiah

మహబూబాబాద్​ జిల్లా చిన్న ముప్పారంలో పసుపు సాగులో అవలంభిస్తున్న ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి శివలింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Farmers should adopt modern practices
'రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించాలి'

By

Published : Dec 22, 2019, 12:07 PM IST

వ్యవసాయంలో రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి.. అధిక దిగుబడులు పొందాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ శివలింగయ్య పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో పసుపు సాగులో అవలంభిస్తున్న ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

చిన్న ముప్పారంలో 70 శాతం ఎర్ర నేలలు ఉన్నాయని, ఇవి పసుపు పంటకు అనుకూలంగా ఉంటాయని శివలింగయ్య పేర్కొన్నారు. ఇక్కడి రైతులు ఆరోగ్యకరమైన, నాణ్యమైన, తక్కువ కాలంలో పండే పంటలను పండిస్తున్నారన్నారు. వీరిని సంఘటితం చేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అనంతరం పసుపు చేనులో దుంపలను పరిశీలించారు. కార్యక్రమంలో పసుపు రైతులు, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

'రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించాలి'

ఇదీ చదవండి:ఫోన్​ మాట్లాడుతూ భవనం పైనుంచి పడి మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details