తెలంగాణ

telangana

ETV Bharat / state

గూడూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు - యూరియా కోసం బారులు తీరిన రైతులు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. 450 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. మరో 1,820 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. వాటిని త్వరలో పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారి వెల్లడించారు.

queue of farmers at mahabubabad district
గూడూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు

By

Published : Aug 10, 2020, 9:46 PM IST

సకాలంలో వర్షాలు కురవడం వల్ల రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. జిల్లాలోని 39 గ్రామాలకు చెందిన రైతులంతా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను వేశారు. గత నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున.. అన్ని పంటలకు యూరియా వేయాల్సి రాగా.. రైతులంతా యూరియా కోసం వచ్చారు.

సోమవారం 450 బస్తాల యూరియా మండల కేంద్రానికి రాగా... అన్నదాతలకు పంపిణీ చేశారు. యూరియా కొరతపై వ్యవసాయ అధికారి రాకేశ్​ను వివరణ కోరగా.. మండలానికి 1,820 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. త్వరలో బొడ్డుగొండ, గుండెంగ సొసైటీల్లోని యూరియా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. తాము ఇబ్బందులు పడకుండా సకాలంలో యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:-ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!

ABOUT THE AUTHOR

...view details