కొనుగోలు కేంద్రాలలోని మొక్కజొన్నల బస్తాలను గోదాంలకు తరలించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తిలో రైతులు ఆందోళన చేశారు. రహదారిపై ముళ్ల కంచె వేసి... రాస్తారోకో చేపట్టారు. మక్కలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు.
మొక్కజొన్నలు గోదాంకు తరలించాలని రైతుల ఆందోళన... - farmers protested
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తిలో మొక్కజొన్న రైతులు ఆందోళన చేశారు. రహదారిపై ముళ్ల కంచె వేసి... రాస్తారోకో చేపట్టారు. మక్కలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు.
మొక్కజొన్నలు గోదాంకు తరలించాలని రైతుల ఆందోళన...
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కాంటాలై.... పది రోజులు దాటుతున్నా బస్తాలు తరలించటం లేదని రైతులు ఆరోపించారు. అకాల వర్షాలకు బస్తాలు తడిసిపోతే రైతులను బాధ్యులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండాలని ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్లోని బస్తాలను తరలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు.