పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలంటూ... పెట్రోల్ సీసాలతో వాటర్ ట్యాంకు ఎక్కి రైతులు నిరసన తెలిపిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని నారాయణపురం గ్రామ రైతులకు ఇప్పటి వరకు నూతన పట్టా పాస్ పుస్తకాలు జారీ కాలేదు. పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులను విన్నవించుకున్నా... ఫలితం లేదని ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. జేసీతో మాట్లాడి పాసుపుస్తుకాలు ఇప్పిస్తానన్న తహసీల్దార్ సురేష్ కుమార్ హామీతో రైతులు శాంతించారు.
వాటర్ ట్యాంకు ఎక్కి రైతుల నిరసన - farmers protest in kesamudram
మహబూబాబాద్ జిల్లా కేసముంద్రంలో పెట్రోల్ సీసాలు పట్టుకోని వాటర్ ట్యాంకు ఎక్కి రైతులు నిరసన తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![వాటర్ ట్యాంకు ఎక్కి రైతుల నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4641222-thumbnail-3x2-far.jpg)
వాటర్ ట్యాంకు ఎక్కి రైతుల నిరసన