ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులు దాటుతోన్నా.. తూకాలు వేయడం లేదంటూ రైతులు మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా శనిగపురంలోని భువనేశ్వరీ కొనుగోలు కేంద్రం ఎదుట రాస్తారోకో చేపట్టారు. 40 కేజీల బస్తాకు.. 2 నుంచి 3 కేజీల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'కొనుగోలు కేంద్రాల్లో కోత విధిస్తున్నారు' - కొనుగోలు కేంద్రాల్లో కోత
మహబూబాబాద్ జిల్లాలోని అన్నదాతలు రోడ్డెక్కారు. సమస్యలను పరిష్కరించాలంటూ శనిగపురంలోని భువనేశ్వరీ కొనుగోలు కేంద్రం ఎదుట రాస్తారోకో చేపట్టారు. 40 కేజీల బస్తాకు.. 2 నుంచి 3 కేజీల ధాన్యాన్ని కోత విధిస్తున్నారంటూ కేంద్రం నిర్వాహకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
farmers concerns
విషయంపై స్పందించిన కేంద్రం నిర్వాహకురాలు అరుణ.. కేంద్రంలో ఇప్పటికే 7500 బస్తాల ధాన్యం నిల్వ ఉందని తెలిపారు. 20 రోజులుగా లారీలు రావడం లేదన్నారు. పెద్దపల్లిలోని అన్నపూర్ణ ఇండస్ట్రీకి 900 క్వింటాల ధాన్యాన్ని పంపించగా.. వారు దిగుమతి చేసుకోలేదని వివరించారు. విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదని వాపోయారు.